Kamareddy Ganesh Mandaps | కామారెడ్డిలో అబ్బురపరుస్తున్న గణేష్ మండపాల సెట్టింగులు

కామారెడ్డి పట్టణంలోని గణేష్​ మండపాల సెట్టింగ్​లు ఆకట్టుకుంటున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganesh Mandaps | ఈ ఏడాది వినాయక మండపాల్లో భక్తితో పాటు క్రియేటివిటీ కూడా కొలువుదీరింది. కామారెడ్డి (Kamareddy)లో ఏర్పాటు చేసిన వివిధ గణపతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Kamareddy Ganesh Mandaps | పట్టణంలో హల్క్​ అవతారంలో..

పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సెట్టింగ్​లో హల్క్ అవతారంలో గణపతి కనిపిస్తే, పక్కనే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా వంటి అవెంజర్స్ హీరోలు ఉన్నారు. మరో మండపంలో పిల్లనగ్రోవి పట్టుకుని జగన్నాథుడి రూపంలో, నల్లని ఛాయతో కృష్ణ తత్వాన్ని చాటుతూ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. హరిజనవాడలో వానర సేనతో, చెట్టు కొమ్మలపై కోతుల మధ్య కొంటెగా నవ్వుతూ కూర్చున్న బాల గణపతి సెట్టింగ్ చిన్నారులను అలరిస్తోంది. ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిలిచే గణేషుల్లో గొల్లవాడ గణేష్ ఒకటి. ఈసారి శివతత్వాన్ని చాటేలా ద్వాదశ జ్యోతిర్లింగాల మధ్య, నీటిపై లింగాలతో, డమరుకాలు గాల్లో వేలాడుతూ ఏర్పాటు చేసిన మండపం, రుద్రాక్షలతో అభిషేకం చేస్తున్న రుద్ర గణపతి, ఆదియోగి రూపంలో పార్వతీ సమేతంగా తపస్సులో ఉన్న గణపతి విగ్రహాలు ఆధ్యాత్మికతను పంచుతున్నాయి.

Kamareddy Ganesh Mandaps | స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి సెట్టింగ్​..

Kamareddy Ganesh Mandaps

అన్నింటిలోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్వర్ణగిరి ఆలయం సెట్టింగ్. ఎన్జీవోస్ కాలనీలోని ఓ మండపం లోపల అచ్చం భువనగిరి స్వర్ణగిరి వేంకటేశ్వర ఆలయాన్ని ప్రతిరూపంగా నిర్మించారు. ఇందులో ముందు భాగంలో పెద్ద వేంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు, మధ్యలో నీలిరంగు నీటిపై ఆదిశేషునిపై శయనించిన విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనంత పద్మనాభ స్వామి రూపంలో సేదతీరుతున్న విష్ణుమూర్తి, వెనుక నిలుచున్న నల్లరాతి వేంకటేశ్వర స్వామి, గర్భగుడిలో బంగారు కిరీటంతో కొలువైన భారీ గణపతి – ఒకే మండపంలో ముగ్గురు దేవుళ్ల దర్శనం లభించడంతో భక్తులు క్యూ కట్టి మరీ తిలకిస్తూ ఫొటోలు దిగుతున్నారు.

kmr1 1 kmr2 1 kmr4 1 kmr33 1 kmr44

 

ఇది కూడా చదవండి..: TB Reward Cash | TB రివార్డ్ నగదు ఎక్కడ?..వరుసగా మూడు జాతీయ అవార్డులు.. రూ.10 లక్షల రివార్డు..ఎక్కడికి వెళ్లిందంటూ ఉద్యోగుల ప్రశ్నలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *