Asian Games Shooting | ఆసియా గేమ్స్​.. షూటింగ్​లో భారత్​కు మరో రెండు పతకాలు

ఆసియా గేమ్స్​లో భారత్​ సత్తా చాటుతోంది. షూటింగ్​లో ఇప్పటి వరకు 5 పతకాలు గెలుచుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Asian Games Shooting | జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ విభాగంలో ఇప్పటి వరకు 5 పతకాలు గెలుచుకున్నారు.

ఆసియా గేమ్స్ (Asian Games) తొలిరోజు 10మీటర్ల ఎయిర్​ పిస్టల్​ టీం, వ్యక్తిగత ప్రదర్శనలో భారత్​ రెండు రజత పతాకాలు గెలుచుకుంది. అలాగే పురుషుల టీం విభాగంలో హిమాన్షు ధిల్లాన్, రుద్రాంక్ష్​ పాటిల్​ జోడీ సిల్వర్​ అందుకుంది. సోమవారం వ్యక్తిగత విభాగాల్లో వీరు ఇద్దరు పతకాలు గెలుచోవడం గమనార్హం. 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్​ విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకాన్ని గెలుచుకోగా, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించాడు. మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​లో ఒక పతకం వచ్చింది. దీంతో భారత ఖాతాలో నాలుగు రజత, రెండు కాంస్య పతకాలు చేరాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఇండియా పదో స్థానంలో ఉంది.

Asian Games Shooting | మార్షల్​ ఆర్ట్స్​లో

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో మహిళల 60 కేజీల విభాగంలో సింగపూర్‌కు చెందిన విక్టోరియా టియోతో జరిగిన సెమీ-ఫైనల్‌లో సుచికా తరియల్ ఓడిపోయారు. దీంతో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నిర్ణయంఐ భారత బృందం అప్పీల్ చేసింది. భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు పాకిస్తాన్‌ను 3-0 తేడాతో ఓడించి క్వార్టర్-ఫైనల్స్‌కు చేరింది.

ఇది కూడా చదవండి..: Chandrasekharan Reappointment | చంద్రశేఖరన్‌ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్‌ కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *