Swiggy LPG Delivery | స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సరికొత్త సేవలు.. నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్

నిత్యావసర సరుకుల డెలివరీలో దూసుకుపోతున్న ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ (Swiggy Instamart) కస్టమర్ల కోసం మరో వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Swiggy LPG Delivery | నిత్యావసర సరుకుల డెలివరీలో దూసుకుపోతున్న ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ (Swiggy Instamart) కస్టమర్ల కోసం మరో వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యాప్‌లో ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే వంటగ్యాస్‌ (LPG) సిలిండర్‌ను డెలివరీ చేసేందుకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఇలాంటి సేవలను అందిస్తున్న తొలి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కావడం విశేషం.

Swiggy LPG Delivery | ఏయే సిలిండర్లు లభిస్తాయి?

ప్రస్తుతానికి ఈ సేవలను బెంగళూరు నగరంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కస్టమర్లు హెచ్‌పీసీఎల్ ప్రవేశపెట్టిన 10 కిలోల ‘హెచ్‌పీ నవ్య’ (HP Navya) కాంపోజిట్ సిలిండర్‌ను, 5 కిలోల సాధారణ సిలిండర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. ‘హెచ్‌పీ నవ్య’ సిలిండర్ పారదర్శకంగా ఉండటం వల్ల, లోపల గ్యాస్ ఎంతుందో వినియోగదారులు సులభంగా చూసుకునే అవకాశం ఉంటుంది.

swigg

Swiggy LPG Delivery | కనెక్షన్ లేకున్నా సరే..

ఈ సేవల ద్వారా సిలిండర్ పొందడానికి కస్టమర్ల వద్ద ముందుగా ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన పని లేదు. అద్దె ఇళ్లలో నివసించే విద్యార్థులు, ఉద్యోగులు , చిన్న కుటుంబాలకు ఈ సేవలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. మొదటిసారి ఆర్డర్ చేసేటప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా, యాప్‌లో తమ గుర్తింపు కార్డు (ID Verification) వివరాలను కస్టమర్లు నమోదు చేయాలి. తదుపరి ఆర్డర్ల సమయంలో ఖాళీ సిలిండర్‌ను డెలివరీ బాయ్‌కి ఇచ్చి (Swap విధానం), నిండు సిలిండర్‌ను తీసుకోవచ్చు.

Swiggy LPG Delivery | సురక్షిత డెలివరీ..

స్విగ్గీ యాప్‌లో ఆర్డర్ రాగానే, అది నేరుగా స్థానిక హెచ్‌పీసీఎల్ ఏజెన్సీకి చేరుతుంది. శిక్షణ పొందిన వారి సిబ్బంది ద్వారా మాత్రమే ఈ డెలివరీ జరుగుతుంది. కిరాణా సరుకులతో పాటు అత్యవసరమైన గృహ అవసరాలను కూడా అత్యంత వేగంగా, నమ్మకంగా అందిస్తున్నామని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేష్ ఝా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  CBSE On-Screen Marking | సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్‌లో లోపాలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *