SIR Revision Process | ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: SIR Revision Process | స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Suryanarayana) సూచించారు. నగరంలోని (Nizamabad) 28వ డివిజన్​లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు.

SIR Revision Process |ఎస్​ఐఆర్​లో ప్రతిఒక్కరిని భాగస్వామ్యులను చేయాలి

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కాబట్టి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్​లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా ఎన్యుమరేషన్ పత్రాలను పూర్తిచేసి సంబంధిత బీఎల్​వోలకు అందజేయాలన్నారు. అనేకమందికి ఎన్యుమరేషన్ ​ ఫామ్ నింపడంలో గందరగోళం ఏర్పడుతుందని, కావున ఓటర్లకు బీఎల్వోలు, పార్టీ బీఎల్​ఏలు సహకరించాలని సూచించారు. కార్పోరేటర్ల సైతం తమ పరిధిలోని ఓటర్లకు తగు సూచనలు చేస్తూ ఎన్యుమరేషన్ ఫారాలను నింపి తిరిగి ఇచ్చేలా చూడాలన్నారు.

SIR Revision Process | ఎస్ఐఆర్ గడువు పెంపు

కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ గడుపును ఈ నెల 24 నుంచి ఆగస్టు 3వ తేదీకి పొడిగించిందని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలోని ఓటర్లందరూ గమనించి నిర్ణీత గడువులోపు ఎన్యుమరేషన్ పత్రాలను సంబంధిత బీఎల్​వోలకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్కాయి మహేందర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

rakecjet

ఇది కూడా చదవండి: CC Footage | షాపింగ్ కాంప్లెక్స్ నుంచి పడిన చిన్నారి.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *