Telangana Voter Revision | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ప్రకటన చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Voter Revision | తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ప్రకటన చేసింది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు, క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

Telangana Voter Revision | పొడిగింపునకు కారణం

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఎన్యుమరేషన్ ఫారాలు కూడా అందలేదని గుర్తించడంతో, ఈ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను జారీ చేసింది.

sir.1

Telangana Voter Revision | ప్రక్రియలో కీలక తేదీలు..

బూత్ స్థాయి అధికారులు జూన్ 25న ప్రారంభించిన ఇంటింటి సర్వే ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత, ఆగస్టు 10న అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను (Draft Publication) అధికారికంగా విడుదల చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు కొత్త ఓటర్ల నమోదుతో పాటు, ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు-చేర్పులు చేసుకోవడానికి, అలాగే అభ్యంతరాలను (Claims & Objections) తెలియజేయడానికి ప్రజలకు నెల రోజుల గడువు ఉంటుంది. ఇలా వచ్చిన విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే ప్రక్రియను ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు పూర్తి చేస్తారు. చివరగా, అన్ని అభ్యంతరాలు , దరఖాస్తుల పరిష్కారం తర్వాత, అక్టోబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటర్ల జాబితాను (Final Publication) అధికారికంగా ప్రకటించనున్నారు.

 

ఇది కూడా చదవండి:  Swiggy LPG Delivery | స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సరికొత్త సేవలు.. నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *