అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy | రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోసం స్వయంగా పూరీలు వండి, ఆ మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Revanth Reddy | మనవడి కోరిక..
“తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడగడంతో, ముఖ్యమంత్రి మనవడి కోరికను కాదనలేక, తనే పూరీలు వేశారు. “పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, గుండ్రంగా లేని డజన్ పూరీలు.. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు” అని రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.
Revanth Reddy | వైరల్ అవుతున్న వీడియో..
ఈ సందర్భంగా తీసిన వీడియోలో ముఖ్యమంత్రి చాలా ఉత్సాహంగా, మనవడితో కలిసి పూరీలు వేయడం కనిపిస్తుంది. రాజకీయ నాయకుడిగా బిజీగా గడిపినా, ఇంట్లో ఒక తాతగా చేసిన పనులకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కష్టతరమైన రాజకీయ పనుల మధ్య కూడా కుటుంబానికి సమయం కేటాయించడం పట్ల పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.
మనవడి కోసం పూరీలు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంట్లో మనవడి కోసం పూరీలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడిగితే తప్పుతుందా?.. పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో… pic.twitter.com/5De759GTYy
— Akshara Today | Telugu News (@aksharatoday) July 9, 2026
ఇది కూడా చదవండి: Bhageerath Bail | హైకోర్టు కీలక తీర్పు.. బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు