అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi Hyderabad Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్ చేరుకున్నారు. బెంగళూరు పర్యటన ముగించుకొని ఆయన ప్రత్యేక విమానంలో నగరానికి వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ప్రధానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఘన స్వాగతం పలికారు.
ప్రధాని బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసీసీకి బయలు దేరారు. షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా ప్రధాని రాష్ట్రానికి వచ్చారు. మోదీ రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. వర్చువల్‌గా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి ప్రధాని మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభలో మోదీ మాట్లాడుతారు.
Modi Hyderabad Visit | టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభం
వరంగల్‌లో పీఎం మిత్రా పార్క్ (కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్)ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రధానికి స్వాగతం పలికారు. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిస్థాయి పీఎం మిత్రా పార్క్ ఇక్కడకు చేరుకుందన్నారు. ఒకప్పుడు వరంగల్ నేత కార్మికులు తమ సొంత ఊళ్లకు దూరంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, నేడు వరంగల్ వారిని పిలుస్తొందన్నారు.
హైటెక్స్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Inter Admissions | యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు.. సీఎం కీలక ఆదేశాలు

