నిజామాబాద్SIR Mapping Process | ఓటర్లంతా ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేయించుకోవాలి

SIR Mapping Process | ఓటర్లంతా ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేయించుకోవాలి

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఓటరు ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) మ్యాపింగ్ చేసుకోవాలని కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు.

అక్షరటుడే, ఇందూరు: SIR Mapping Process | నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఓటరు ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) (SIR Mapping Process) మ్యాపింగ్ చేసుకోవాలని మున్సిపల్​ కార్పొరేషన్(Nizamabad Municipal Corporation)​ కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dilip Kumar) కోరారు. ఎస్​ఐఆర్ మ్యాపింగ్(SIR Mapping) ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

SIR Mapping Process | 2002 ఓటరు జాబితా ప్రకారం మ్యాపింగ్​..

ఓటరు జాబితాను సమగ్రంగా పరిశీలించడమే ఎస్​ఐఆర్​ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని కమిషనర్​ తెలిపారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా ఇప్పుడు ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. 2002 ఓటర్ జాబితాలో పేరు ఉంటే, ప్రస్తుతం 2025 ఓటరు జాబితాలోని పేరుతో సెల్ఫ్ మ్యాపింగ్ చేసుకోవచ్చని సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల (మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్లు, కొన్ని చోట్ల అంగన్​వాడీ టీచర్లు, ఆర్పీలు, బీఎల్​వో) ద్వారా మ్యాపింగ్ చేయించుకోవచ్చని పేర్కొన్నారు. మన ప్రస్తుత ఓటర్ కార్డ్ ని 2002 జాబితాలో (Election Commission) ఉన్న వాళ్ల ఓటర్ కార్డును లింకు చేసుకోవడం లేదా మనకు 2002లో ఓటు ఉంటే దాంతో మనం మనల్ని లింక్ చేసుకోవడం ద్వారా మ్యాపింగ్ చేసుకోవాలని కోరారు.

SIR Mapping Process | కొన్ని రాష్ట్రాల్లో ఎస్​ఐఆర్​ పూర్తి..

ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రీ మ్యాపింగ్ కొనసాగుతోందని, త్వరలో ఎస్​ఐఆర్ ప్రారంభమవుతుందని మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ పేర్కొన్నారు. మ్యాపింగ్ ఎన్యూమనరేషన్ ఫామ్​తో పాటు ఈసీ పేర్కొన్న డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని కమిషనర్ తెలిపారు. మ్యాపింగ్ పూర్తయిన వాళ్లు ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం ఉండదని అన్నారు. 2002 ఓటర్ జాబితాలోని వివరాలకు ప్రస్తుత జాబితాలోని వివరాలకు స్వల్ప తేడాలున్నా మ్యాపింగ్ పూర్తవుతుందని అన్నారు. ఎస్​ఐఆర్ ఆవశ్యకతను గుర్తిస్తూ, అందరూ మ్యాపింగ్ చేయించుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: Modi Hyderabad Visit | హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

PM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్​ పాత్ర కీలకం : ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్...

Qatar Missile Attack| ఖతార్ తీరంలో క్షిపణి దాడి.. మంటల్లో బల్క్ క్యారియర్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Qatar Missile Attack|పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మరోసారి శిఖరాగ్రానికి చేరుకున్నాయి....

Modi Hyderabad Visit | హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Hyderabad Visit | ప్రధాన మంత్రి...

Inter Supplementary Exams | నిఘా నీడలో ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు : డీఐఈవో రవికుమార్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Inter Supplementary Exams | కట్టుదిట్టమైన సీసీకెమెరాల...