CMR Targets | సీఎంఆర్​ లక్ష్యాలను పూర్తి చేయాలి

జిల్లాలో సీఎంఆర్​ లక్ష్యాలను పూర్తిచేయాలని సివిల్​ సప్లయిస్​​ డైరెక్టర్​ సత్యనారాయణ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: CMR Targets | జిల్లాలో సీఎంఆర్​ లక్ష్యాలను పూర్తిచేయాలని.. రైస్​మిల్లర్లు సీఎంఆర్​ సరఫరాలను వేగవంతం చేయాలని సివిల్​ సప్లయిస్​​ డైరెక్టర్​ సత్యనారాయణ పేర్కొన్నారు. కలెక్టరేట్ (Collectorate)​లో బుధవారం సివిల్​ సప్లయ్​ శాఖ, ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా అధికారులు, రైస్​మిల్లర్స్​ అసోసియేషన్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.

CMR Targets | ​ సరఫరాపై ఆరా..!

సివిల్​ సప్లయిస్​​ డైరెక్టర్ మాట్లాడుతూ.. రైస్​మిల్లర్లు ఎఫ్​సీఐకి కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్​)  సరఫరా చేస్తున్న పురోగతిపై ఆరా తీశారు. రబీ 2022-23 ధాన్యం వేలం విక్రయాల ఆదాయం జమ చేయడంపై ఆయన అధికారులతో చర్చించారు. ఎఫ్​సీఐ (FCI) గోదాముల్లో నిల్వ స్థలం లభ్యత, సీఎంఆర్​ సరఫరాపై మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. సీఎంఆర్​ సరఫరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని.. ఎఫ్​సీఐ మిల్లర్లతో సమన్వయం చేసుకుని అడ్డంకులను పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ భుజంగరావు,  డీసీవోలు, డీఎంలు హాజరయ్యారు.

CMR Targets

ఇది కూడా చదవండి..: Prashanth Reddy | గృహనిర్భందం చేసి నా గొంతు నొక్కలేరు.. మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *