అక్షరటుడే, కామారెడ్డి: Drug Awareness | మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగ వ్యతిరేక దినాన్ని గురువారం పట్టణంలో నిర్వహించారు.
Drug Awareness | పట్టణంలో ర్యాలీ..
జిల్లా పరిపాలన(Kamareddy), పోలీసు, ఎక్సైజ్, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారులు, పోలీసులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై (Anti Drug Campaign) నినాదాలు చేస్తూ చైతన్యపరిచారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభమని, మత్తు పదార్థాలు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజ అభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. మత్తుకు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని సూచించారు.
Drug Awareness | ప్రత్యేక చర్యలు..
ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా ఉందని తెలిపారు. సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి, అదనపు కలెక్టర్ ఎన్వీ గిరి, జిల్లా సంక్షేమ అధికారి ప్రసన్న, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, డీఎస్పీ మధుసూదన్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బస్సులో ప్రయాణించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్