Kamareddy Road Potholes | కామారెడ్డి పట్టణంలో అధ్వాన రోడ్లతో అవస్థలెన్నో..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలోని హనీ బేకర్స్ మూలమలుపు మృత్యు మలుపుగా మారింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Road Potholes | జిల్లా కేంద్రంలోని (Kamareddy) నిజాంసాగర్ చౌరస్తాలోని హనీ బేకర్స్ మూలమలుపు మృత్యు మలుపుగా మారింది. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలు, అడ్డంగా ఉన్న బారికేడ్లతో ఆ మలుపు వాహనదారులకు నరకం చూపుతోంది.

Kamareddy Road Potholes | భారీ గుంతలతో..

బేకరీకి సరిగ్గా ముందే రోడ్డు తేలిపోయి గుంతలు పడ్డాయి. చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం పోలీసులు యూటర్న్ మూసేస్తూ వేసిన బారికేడ్లు దానికి తోడయ్యాయి. దీంతో గుంతలకు, బారికేడ్లకు మధ్య ఒక కారు మాత్రమే వెళ్లేంత ఇరుకు స్థలం మిగిలింది. మూలమలుపు కావడంతో ఎదురుగా వచ్చే వాహనం కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యపై గతంలో అక్షరటుడేలో కథనం రాగానే అధికారులు మట్టి, కంకరతో పూడ్చి తాత్కాలికంగా బీటీ రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. ఇటీవల కురుసిన వర్షాలకు ఆ ప్యాచ్ వర్క్ కొట్టుకుపోయి పరిస్థితి మొదటికి వచ్చింది. రోడ్డుపైకి వచ్చిన కంకర రాళ్లతో వాహనాలు స్కిడ్ అవుతున్నాయి.

Kamareddy Road Potholes | వారం క్రితం ఓ వ్యక్తి..

వారం క్రితం ఉదయం 8 గంటలకు తన కుమార్తెను కళాశాలకు తీసుకెళ్తున్న ఓ తండ్రి ఇదే మూల మలుపు వద్ద కంకర రాయి తగిలి స్కిడ్ అయి బైకుపై నుంచి పడిపోయారు. వెనుక వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రెండు రోజుల్లో వినాయక నిమజ్జన శోభాయాత్రలు ఇదే దారి నుంచి వెళ్లనున్న నేపథ్యంలో భారీ వాహనాలు, ట్రాక్టర్లు ఈ గుంతల్లో ఇరుక్కుంటే ప్రమాదం తప్పదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత మేల్కొనే అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: DUSU Election Results | ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *