Polytechnic Students Protest | ఫలించిన పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం.. విలీనం ప్రతిపాదనపై ప్రభుత్వం యూటర్న్

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE)కి సంబంధించిన అంశాలు, పరీక్షల నిర్వహణ, ఇతర అకడమిక్‌ ప్రక్రియలు కూడా పాత పద్ధతిలోనే కొనసాగనున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Polytechnic Students Protest | పాలిటెక్నిక్‌ విద్యార్థులు, అధ్యాపకులు చేపట్టిన పోరాటం ఫలించింది. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల విలీనం ప్రతిపాదనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ మేరకు పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు ఉండబోవని స్పష్టత వచ్చింది.

పాలిటెక్నిక్‌ కాలేజీలను యంగ్‌ ఇండియా India స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రతిపాదనలో భాగంగా చేపట్టిన ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. ఇకపై కూడా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనున్నాయి.

Polytechnic Students Protest | పాత విధానంలోనే డిప్లొమా విద్య

సాంకేతిక విద్యాశాఖతో పాటు సాంకేతిక విద్యామండలి కూడా యథాతథంగా కొనసాగనుంది. డిప్లొమా కోర్సుల నిర్వహణలో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. విద్యార్థుల ప్రవేశాలు, కోర్సుల నిర్వహణ, పరీక్షల విధానంలోనూ ప్రస్తుతం అమల్లో ఉన్న విధానమే కొనసాగనుంది.

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE)కి సంబంధించిన అంశాలు, పరీక్షల నిర్వహణ, ఇతర అకడమిక్‌ ప్రక్రియలు కూడా పాత పద్ధతిలోనే కొనసాగనున్నాయి. దీంతో పాలిటెక్నిక్‌ విద్యార్థులు, అధ్యాపకుల్లో నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది.

Polytechnic Students Protest | 35 రోజులుగా ఆందోళన

పాలిటెక్నిక్‌ కాలేజీల విలీనం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు సుమారు 35 రోజులుగా ఆందోళనలు కొనసాగించారు. విలీనం వల్ల పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టారు.

అధ్యాపకులు సహాయ నిరాకరణకు దిగడంతో ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. చివరకు పాలిటెక్నిక్‌ విద్యను పాత విధానంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Hamleys Hyderabad Store| హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో హ్యామ్లీస్ అతిపెద్ద ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాలిటెక్నిక్‌ విద్యార్థులు, అధ్యాపకుల ప్రధాన డిమాండ్లకు పరిష్కారం లభించినట్లయింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత పూర్తి వివరాలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *