Hamleys Hyderabad Store| హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో హ్యామ్లీస్ అతిపెద్ద ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

ప్రపంచంలోనే అతి పురాతనమైన, అత్యంత ప్రసిద్ధ బొమ్మల రిటైల్ బ్రాండ్ అయిన 'హ్యామ్లీస్' (Hamleys), హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hamleys Hyderabad Store | ప్రపంచంలోనే అతి పురాతనమైన, అత్యంత ప్రసిద్ధ బొమ్మల రిటైల్ బ్రాండ్ అయిన ‘హ్యామ్లీస్’ (Hamleys), హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో  ( Jubilee Hills )తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. నగరంలో హ్యామ్లీస్‌కు ఇది 10వ స్టోర్ కాగా, అత్యంత విశాలమైన , ప్రముఖ గమ్యస్థానంగా నిలిచింది. సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, మూడు అంతస్తులుగా రూపుదిద్దుకున్న ఈ స్టోర్ పిల్లలు, కుటుంబాలు , బొమ్మల ప్రియుల కోసం ఆటలు, బహుమతులు, వినోద ప్రపంచాన్ని ఒకే చోట అందిస్తోంది.

Hamleys Hyderabad Store | ప్రత్యేక ఆకర్షణలు..

హ్యామ్లీస్ అనగానే గుర్తొచ్చే లైవ్ థియేటర్ అనుభూతిని ఈ స్టోర్ అద్భుతంగా కళ్లకు కడుతోంది. టాయ్ సోల్జర్, పైరేట్స్, ఇంగ్లీష్‌మ్యాన్, రాగ్‌డాల్‌తో పాటు ఎంతో ఇష్టమైన హ్యామ్లీ , హ్యాటీ పాత్రలు ఈ స్టోర్‌లో సందడి చేయనున్నాయి. ఇక్కడ 10,000లకు పైగా బొమ్మలు, ఆటలు, గిఫ్టింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, వినియోగదారుల కోసం నవంబర్‌లో ప్రత్యేకంగా ఒక ప్లే ఏరియా కూడా ప్రారంభం కానుంది.

Hamleys Hyderabad Store | ప్రారంభోత్సవ వేడుకలు..

ఈ స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 18న సాయంత్రం ప్రత్యేకంగా గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖులు, క్రియేటర్లు, మీడియా ప్రతినిధులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘మై లిటిల్ పోని’, ‘పిజె మాస్క్స్’ పాత్రలతో పాటు హ్యామ్లీస్ కుటుంబ సభ్యులు ఈ వేడుకను మరింత ఆకర్షణీయంగా మార్చారు. అతిథుల కోసం ప్రత్యేకంగా డి.ఐ.వై (DIY) కార్యకలాపాలు, ఫుడ్ అండ్ బెవరేజెస్ (F&B) అనుభవాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన హ్యామ్లీస్, కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా చిన్నారుల్లో ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంచే వినూత్న అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను తీర్చిదిద్దింది.

ఇది కూడా చదవండి:  Tirumala Brahmotsavam | స్వర్ణరథంపై విహరించిన శ్రీవారు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *