అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala Brahmotsavam | తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన స్వర్ణరథోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. గ్యాలరీలు అన్ని నిండిపోయాయి. మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి.
Tirumala Brahmotsavam | రథాన్ని లాగిన మహిళలు
రథోత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తితో స్వామివారి రథాన్ని లాగారు. గజరాజులు ముందు వెళ్తుండగా, కళాకారుల ప్రదర్శనసల మధ్య, మంగళవాయిద్యాల నడుమ స్వర్ణరథం మాడ వీధుల్లో ముందుకు సాగింది. ఈ దృశ్యాన్ని చూసి భక్తజనం పులకించిపోయారు. టీటీడీ (TTD) ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు సిహెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Sri Malayappa Swamy, with Sri Devi and Bhu Devi, blessed devotees from the magnificent Swarnaratham as Govinda Nama echoed through Tirumala. Women devotees pulled the sacred chariot in devotion.#TTD #Tirumala #Swarnaratham #SalakatlaBrahmotsavam pic.twitter.com/T12ZsDNsar
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 20, 2026
దీనిని కూడా చదవండి : lift accident | లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి.. కాపాడిన హైడ్రా