అక్షరటుడే, వెబ్‌డెస్క్ : lift accident | ఓ వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. తాను దిగేలోపే లిఫ్ట్ కదలడంతో గోడకు, లిఫ్ట్‌కు మధ్య చిక్కుకుపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మూసాపేటలో ఆదివారం చోటు చేసుకుంది.
మూసాపేట ఆంజనేయనగర్‌లోని 3 అంతస్తుల భవనంలో గ్రిల్స్‌తో పాత లిఫ్ట్ ఉంది. మురళి (40) అనే వ్యక్తి అందులో ఎక్కి రెండో అంతస్తులో దిగడానికి యత్నించాడు. అయితే సెన్సార్లు సక్రమంగా పని చేయకపోవడంతో ఆ వ్యక్తి.. బయటకు వచ్చేలోపే లిఫ్ట్ పైకి వెళ్లింది. దీంతో ఆయన లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. హైడ్రా సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
lift accident | గంటన్నర పాటు శ్రమించి..
గ్రిల్స్‌లో కాలు ఇరుక్కొని వేళాడుతున్న మురళిని దాదాపు గంటన్నర పాటు శ్రమించి హైడ్రా (Hydraa) సిబ్బంది బయటకు తీశారు. అతడిని రక్షించేందుకు లిఫ్ట్ గోడను బద్దలు కొట్టారు. అధికారులు మాట్లాడుతూ.. మురళి తన భార్యతో కలిసి లిఫ్ట్ ఎక్కాడని చెప్పారు. రెండో అంతస్తులో దిగే సమయంలో ఒక కాలు బయట పెట్టగానే.. థర్డ్ ఫ్లోర్ వేరే వాళ్లు లిఫ్ట్ బటన్ నొక్కడంతో అది పైకి వెళ్లింది. మురళి కాలు ఒకటి లిఫ్ట్‌లో – మరొకటి రెండో అంతస్తులో ఉండిపోయింది. గ్రిల్స్ అతడు చిక్కుకోవడంతో ఆయన భార్య కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. హైడ్రా సిబ్బంది ఆయనను కాపాడి ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఫ్యాక్చర్ అయిందని వైద్యులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Harish Rao | భూ కబ్జాలపై విచారణకు దమ్ముందా?.. రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్..!