అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bollaram Child Murder Case | సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని బొల్లారంలో ఇటీవల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. తనను ఉద్యోగం నుంచి తొలగించారని సెక్యూరిటీ గార్డు ఈ దారుణానికి పాల్పడిన విషయం తెలిసిందే.
బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో విల్లా ఆర్కిడ్స్లో ఐదేళ్ల చిన్నారి అరేలియా మౌజెస్ను సెక్యూరిటీ గార్డు కిడ్నాప్ చేసి హత్య చేశాడు. అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించడంతో కక్షతో బాలికను కిడ్నాప్ చేశాడు. అతడికి మరో సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రీషన్ సహకరించారు. అయితే పోలీసులకు దొరుకుతారనే భయంతో విక్రమ్ అనంతరం బాలికను హత్య చేసి పారిపోయాడు.
Bollaram Child Murder Case | రూ.20 లక్షల డిమాండ్
సెక్యూరిటీ గార్డు విక్రమ్ చిన్నారిని కిడ్నాప్ చేసి, బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.20 లక్షల డిమాండ్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో బాలిక మృతదేహాన్ని సంప్‌లో గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతంలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా ప్రధాన నిందితుడు విక్రమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరి సుమతి ఈ రోజు బేగంపేటలోని సీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.
ఇది కూడా చదవండి..: Metro Common Pass | తగ్గనున్న మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరలు!