Adibatla TCS Ayyappa row | ఆదిభట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప దీక్షా వస్త్రధారణ వివాదం.. గేటు ఎదుట భక్తుల నిరసనతో ఉద్రిక్తత!

దీక్షా వస్త్రాలైన నల్ల దుస్తులు ధరించి ఆఫీసుకు రావడంపై ఓ సీనియర్ టీమ్ లీడ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Adibatla TCS Ayyappa row | హైదరాబాద్ నగర శివారులోని ఆదిభట్ల (Adibatla) టీసీఎస్ (TCS) క్యాంపస్ వద్ద అయ్యప్ప దీక్షా వస్త్రధారణ (డ్రెస్ కోడ్) వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయ్యప్ప మాల ధరించిన ఓ ఉద్యోగిని నల్ల దుస్తుల్లో ఉన్నాడనే కారణంతో ఆఫీసు లోపలికి అనుమతించలేదన్న ఆరోపణలతో, నవంబర్ 19న అయ్యప్ప స్వాములు, వివిధ సంఘాల నాయకులు క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు.

Adibatla TCS Ayyappa row | అసలేం జరిగిందంటే..

ఆదిభట్ల టీసీఎస్ క్యాంపస్‌లో పనిచేస్తున్న మనీష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. తాను అయ్యప్ప మాల ధరించబోతున్న విషయాన్ని రెండు నెలల ముందే సంస్థ మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇచ్చానని మనీష్ తెలిపారు. అయితే, దీక్షా వస్త్రాలైన నల్ల దుస్తులు ధరించి ఆఫీసుకు రావడంపై ఓ సీనియర్ టీమ్ లీడ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

Adibatla TCS Ayyappa row | వివక్షపై ఉద్యోగి ఆవేదన

కంపెనీలో ఎలాంటి కఠినమైన డ్రెస్ కోడ్ నిబంధనలు లేవని, ఇతర సాధారణ దుస్తుల్లో వచ్చిన ఉద్యోగులందరినీ లోపలికి అనుమతించి కేవలం అయ్యప్ప దీక్షా వస్త్రాలు ధరించిన తన విషయంలోనే అభ్యంతరం చెప్పడం సరికాదని మనీష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Adibatla TCS Ayyappa row | టీసీఎస్ గేటు వద్ద నిరసనల హోరు

ఈ విషయం బయటకు పొక్కడంతో గురువారం (నవంబర్ 19) పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, పలు హిందూ సంఘాలు, రాజకీయ కార్యకర్తలు ఆదిభట్ల టీసీఎస్ క్యాంపస్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయ్యప్ప దీక్షా వస్త్రాలతో ఉద్యోగులను విధులకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Adibatla TCS Ayyappa row | పోలీసుల జోక్యం.. పరిస్థితి అదుపులోకి

సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమికంగా స్పందిస్తూ.. ఇది ఎటువంటి మతపరమైన వివాదం కాదని, కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ (అపార్థం) కారణంగా తలెత్తిన సమస్య అని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *