తెలంగాణGovernment Job Age Limit | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వయో పరిమితి పెంచిన ప్రభుత్వం

Government Job Age Limit | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వయో పరిమితి పెంచిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయో పరిమితిని పదేళ్లు పెంచింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Government Job Age Limit | రాష్ట్ర ప్రభుత్వం (State Government) నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయో పరిమితిని పదేళ్లు పెంచింది. ఏడాది పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు జీవో జారీ చేసింది.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. సాధారణ ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు.

తాజాగా ప్రభుత్వం 10 ఏళ్లు పెంచడంతో ఇది 44 ఏళ్లకు పెరిగింది. నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో వయో పరిమితి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ప్రభుత్వ పరీక్షలు (Government Exams) రాయడానికి అర్హత సాధించారు. నియామకాల్లో జాప్యం, నోటిఫికేషన్లు రాకపోవడంతో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న యువత గరిష్ట వయోపరిమితి దాటి పోయారు. దీంతో వారు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Government Job Age Limit | వీటికి మినహాయింపు

వివిధ నియామక సంస్థలు విడుదల చేసే నోటిఫికేషన్లకు ఈ వయో పరిమితి పెంపు వర్తిస్తుంది. అయితే యూనిఫాం సర్వీసులకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేేసింది. పోలీస్, ఫైర్, ఎక్సైజ్, జైలు, అటవీ శాఖల వంటి శారీరక ప్రమాణాలు అవసరమైన ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు వర్తించదని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Bandi Bhagirath Case | బండి భగీరథ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...

Power Supply Disruption | గాలివాన బీభత్సం.. 24 గంటలుగా విద్యుత్​ లేక అవస్థలు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Power Supply Disruption | మండలంలో సోమవారం సాయంత్రం...

Yellareddy Police | అన్నదాత బలవన్మరణం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | అనారోగ్యంతో రైతు ఉరివేసుకుని బలవన్మరణం...

Tank Repair Works | చెరువుల మరమ్మతులపై అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Tank Repair Works | నియోజకవర్గంలో చెరువులు, చెక్​డ్యాంల...