బిజినెస్​Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Gains | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 352 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | ఆమోదయోగ్యమైన ఒప్పందం దిశగా ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆ దేశంపై భారీ దాడులను కొంతకాలంపాటు వాయిదా వేయాలని నిర్ణయించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించడంతో జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గే అవకాశాలున్నాయన్న ఆశలు ఇన్వెస్టర్లలో చిగురిస్తున్నాయి. దీనికితోడు ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం లాభాల బాటలో సాగుతోంది.

Stock Market Gains | స్వల్ప ఒడిదుడుకులు..

సెన్సెక్స్ మంగళవారం ఉదయం 132 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 70 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 375 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో ప్రారంభమెనా మొదట్లో 28 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 135 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 352 పాయింట్ల లాభంతో 75,667 వద్ద, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో 23,759 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | అన్ని ఇండెక్స్‌లు గ్రీన్‌లోనే..

నిఫ్టీలో అన్ని ఇండెక్స్‌లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ 3.96 శాతం పెరగ్గా.. రియాలిటీ 2.28 శాతం, మీడియా ఇండెక్స్ 1.23 శాతం, యుటిలిటీ 0.97 శాతం, పవర్ 0.81 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్స్ లాభాలతో, 9 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 4.08 శాతం, టెక్ మహీంద్రా 3.99 శాతం, టీసీఎస్ 3.37 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.72 శాతం, ఎటర్నల్ 2.38 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : కొటక్ బ్యాంక్ 1.26 శాతం, ఎయిర్‌టెల్ 1.11 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.93 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ 0.68 శాతం, సన్‌ఫార్మా 0.72 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: May 19 Gold Rates | బంగారం, వెండి పరుగులకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Property Tax | భువన్ సర్వేతో బయటపడ్డ కామారెడ్డి ఆస్తిపన్ను బకాయిలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Property Tax | కామారెడ్డి పురపాలక సంఘంలో...

MP Anil kumar | ఎంపీ అర్వింద్ వడదెబ్బ తగిలి మాట్లాడుతుండు: ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Anil kumar | నిజామాబాద్​ ఎంపీ...

Kamareddy Water Supply | నీటి సమస్య తీర్చిన ఘనత షబ్బీర్ అలీదే..: మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Water Supply |కామారెడ్డిలో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి...

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...