May 19 Gold Rates | బంగారం, వెండి పరుగులకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 19 Gold Rates | దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు Silver Prices ఇటీవల భారీ హెచ్చుతగ్గులను నమోదు చేస్తున్నాయి. పది రోజుల క్రితం వరుసగా తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురయ్యారు.

అయితే ఆ తర్వాత పరిస్థితి కాస్త మారడంతో గత వారం రోజులుగా ధరలు తగ్గుదల దిశగా కదులుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం కొనుగోలు చేయాలంటే భారీ మొత్తాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.

మే 19 ఉదయం నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది.

May 19 Gold Rates | త‌గ్గుతున్న ధ‌ర‌లు..

వెండి ధరల్లో కూడా ఇటీవల మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. అయితే గత నాలుగు రోజుల్లోనే వెండి ధర రూ.2 వేలకుపైగా తగ్గడం కొనుగోలుదారులకు కాస్త ఊరటను కలిగిస్తోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,190 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,360గా నమోదైంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,340 వద్ద ట్రేడవుతోంది.

ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ Kerala ప్రాంతాల్లో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,190 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు చెన్నైలో మాత్రం బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,090గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,490గా ఉంది.

May 19 Gold Rates | స్వల్ప మార్పులు

అయితే బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులో మారే అవకాశం ఉంటుంది. ఇవి ఉదయం నమోదైన ధరలు మాత్రమే కావడంతో కొనుగోలు చేయడానికి ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది.

అలాగే బంగారం కొనుగోలు సమయంలో హాల్‌మార్క్ గుర్తు ఉందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, ఇతర స్థానిక పన్నుల కారణంగా ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

Euphoria | ‘యుఫోరియా’: సుఖ భ్రమల్లో యువత.. కన్నీటిలో మునిగిన సమాజం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *