అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 03 Market Analysis | పశ్చిమాసియాలో మళ్లీ జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటుండడంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు తగ్గాయి.
గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్, యూరోప్ మార్కెట్లు లాభాలతో ముగిసినా బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
June 03 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.03 శాతం, ఎస్ అండ్ పీ 0.13 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.01 శాతం నష్టంతో ఉంది.
June 03 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.33 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.76 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.48 శాతం పెరిగాయి.
June 03 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.61 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.09 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.89 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.24 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.48 శాతం నష్టంతో కదలాడుతోంది.
దక్షిణ కొరియా మార్కెట్లు సెలవు కారణంగా మూసి ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.07 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ ఐఐలు వరుసగా 5వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 8,362 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు 11వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 9,589 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.69 నుంచి 1.03 కి పెరిగింది.
- విక్స్ 7.18 శాతం తగ్గి 15.35 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 96.71 డాలర్లకు పెరిగింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసలు బలహీనపడి 95.27 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.23 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.46 వద్ద ఉన్నాయి.
ఏప్రిల్ నెలలో అమెరికాలో ఉద్యోగ ఖాళీలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు 731,000 మేర పెరిగి 7.618 మిలియన్లకు చేరుకున్నాయి; ఇది మే 2024 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి. రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఆర్థికవేత్తలు 6.88 మిలియన్ల భర్తీ కాని ఉద్యోగ ఖాళీలు ఉంటాయని అంచనా వేశారు.
Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..
