CMRF Transgender Healthcare | చరిత్రలో తొలిసారి: ట్రాన్స్‌జెండర్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీకి సీఎంఆర్ఎఫ్ సాయం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CMRF Transgender Healthcare | తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది.

ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ (రొమ్ము అమరిక) శస్త్రచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ తరహా శస్త్రచికిత్సకు ప్రభుత్వ నిధుల నుంచి ఆర్థిక సాయం అందించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సాయం తక్షణమే విడుదలైంది. దీంతో సదరు ట్రాన్స్‌జెండర్ మహిళకు శస్త్రచికిత్స మార్గం సుగమం అయింది.

akshara today .jpgcmrf

CMRF Transgender Healthcare | ఆత్మగౌరవ ప్రయాణంలో మరో ముందడుగు

తెలంగాణ సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు ఇప్పటికే అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్న తరుణంలో.. వారి శారీరక, మానసిక ఆరోగ్య అవసరాలను గుర్తించి, వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం విప్లవాత్మక మార్పుగా నిలుస్తోంది.

ఈ నిర్ణయం వారు సమాజంలో ఆత్మగౌరవంతో, హుందాగా జీవించే హక్కును మరింత బలోపేతం చేసిందని ‘క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్’ హర్షం వ్యక్తం చేసింది.

CMRF Transgender Healthcare | వెల్లువెత్తిన కృతజ్ఞతలు

సర్జరీ విజయవంతంగా ముగిసిన అనంతరం.. ‘క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్’ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎం. ముకుంద మాల నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి ఓఎస్డీ (OSD) వేముల శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

తెలంగాణ దశాబ్ది అవతరణ దినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని.. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, సాధికారత, సామాజిక అనుసంధానం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

cm revanth 11

CMRF Transgender Healthcare | ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం

గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్‌జీబీటీక్యూ (LGBTQ+) కమ్యూనిటీకి, ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య అవసరాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాజా సాయంతో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని సీఎం నిరూపించుకున్నారు.

ఈ చారిత్రాత్మక ముందడుగు భవిష్యత్తులో మరింత మంది ట్రాన్స్‌జెండర్లకు నాణ్యమైన వైద్యం అందేలా మార్గం సుగమం చేస్తుందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *