జాతీయంSuper El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా మార్చేయగల అత్యంత ప్రమాదకరమైన ‘ఎల్ నినో’ ముంచుకొస్తోందని ఐక్యరాజ్యసమితి (UN) తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) కారణంగా వేడెక్కిన భూమండలంపై, ఈ ఎల్ నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి ‘సూపర్ ఎల్ నినో’ ఏర్పడే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

Super El Nino | ‘ఎల్ నినో’ అంటే ఏమిటి?

పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ‘ఎల్ నినో’ అంటారు. ఈ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా గాలి దిశలు మారిపోతాయి,

మేఘాలు దారి తప్పుతాయి. తద్వారా సాధారణంగా వర్షాలు కురవాల్సిన ప్రాంతాల్లో తీవ్రంగా కరవు ఏర్పడటం, ఎడారి ప్రాంతాల్లో ఊహించని స్థాయిలో భారీ వరదలు రావడం లాంటి విపత్కర వాతావరణ మార్పులు ఏర్పడతాయి.

Super El Nino | ప్రపంచవ్యాప్తంగా విపత్కర మార్పులు..

తగ్గని ఉష్ణోగ్రతలు: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోనున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో పగటి పూటతోపాటు రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గకపోవడానికి గ్లోబల్ వార్మింగ్‌తో తోడైన ఎల్ నినోనే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఆహార సంక్షోభం: వానలు లేక పంటలు ఎండిపోవడం, పండకపోవడం వల్ల అంతర్జాతీయంగా ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడుతుంది. తద్వారా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.

పర్యావరణ విధ్వంసం: సముద్రాలు మరింత వేడెక్కడం వల్ల సముద్ర జీవరాశులు, పగడపు దిబ్బలు (Coral Reefs) అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.

akshara today .jpg el nino

Super El Nino | భారత్‌పై ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం

గతంలో (ముఖ్యంగా 2015లో) వచ్చిన ఎల్ నినో భారత దేశవ్యాప్తంగా తీవ్ర కరవు పరిస్థితులను సృష్టించింది. ఈసారి ‘సూపర్ ఎల్ నినో’ రానుండటంతో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని ఒక అంచనా.

Super El Nino | రుతుపవనాలకు గండి

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే నైరుతి రుతుపవనాలను ఎల్ నినో దెబ్బతీసే ప్రమాదం ఉంది. రుతుపవనాలు బలహీనపడి, దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం గణనీయంగా పడిపోతుందని వాతావరణ శాఖ (IMD) ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Super El Nino | తెలుగు రాష్ట్రాలకు ‘ఖరీఫ్ పంట’ గండం

ఈ ఎల్ నినో ప్రభావం ఏడాదంతా కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల భారత్‌లో ముందుగా సాగు రంగమే భారీ నష్టాన్ని చవిచూడనుంది.

ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వర్షపాతం తగ్గితే.. వానాకాలం (ఖరీఫ్) సీజన్ సాగుపై అత్యంత తీవ్రమైన ప్రభావం పడుతుంది.

నిప్పుల కొలిమిలా భూమి

ఇటీవలే మే నెలలో చూసిన భానుడి తీవ్ర రూపం రాబోయే రోజుల్లో మరింతగా ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ఎండలు మండిపోవడమే కాకుండా, రికార్డు స్థాయి వడగాలులు (Heatwaves) వీచే అవకాశం ఉంది.

ఉదయం నుంచే సూర్యుడు నిప్పులు కురిపించే పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఇది మరింత తీవ్రం అయితే ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు, హీట్‌స్ట్రోక్‌లకు గురయ్యే అవకాశం ఉంది.

akshara today .jpgel nino

జల సంక్షోభం

వర్షాలు సరిగ్గా పడకపోతే జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటుతాయి. దీనివల్ల అటు వ్యవసాయానికి, ఇటు తాగునీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడే ముప్పు ఉంది.

కరోనా మహమ్మారి కంటే ఖతర్నాక్‌ అయిన ఈ ‘సూపర్ ఎల్ నినో’ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలతో పాటు భారత్ సైతం ముందస్తు వ్యూహాలు రచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి, నీటి నిల్వలను సమర్థవంతంగా పెంచుకోవడానికి అధికారులు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...