తెలంగాణChain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

నిందితుడు 2023లో మొఘల్ పుర, సైఫాబాద్, చార్మినార్, నాంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా చైన్ స్నాచింగ్​లకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతూ ఏకంగా  180 కేసులలో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. నిందితుడిని మంగళవారం (జూన్ 02, 2026) హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని ఆసిఫ్ నగర్​లోని మురాద్ నగర్​కు చెందిన మహమ్మద్ ఫైజల్ షా అలీ జాబ్రి (43) అలియాస్ అబ్దుల్లా అలియాస్ అల్తాఫ్​గా పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

akshara today .jpgarrest

Chain Snatcher Arrest | చైన్​ స్నాచింగ్​నే వృత్తిగా..

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు చైన్ స్నాచింగ్​ నే వృత్తిగా మార్చుకుని, బంగారు గొలుసుల దొంగతనానికి అలవాటు పడ్డాడు. తెలంగాణలో ఆయా ప్రాంతాలతోపాటు, హైదరాబాద్​, ఆంధ్రప్రదేశ్​లో రిజిస్టర్ అయిన పలు కేసులలో ఇతగాడు నిందితుడిగా ఉన్నాడు. మరో విషయం ఏమిటంటే.. ఈ చైన్​ దొంగపై 14 నాన్ బెయిలబుల్ కేసులు ఉండటం గమనార్హం.

Chain Snatcher Arrest | బెంగళూరు.. ఆంధ్రప్రదేశ్​..

నిందితుడు 2023లో మొఘల్ పుర, సైఫాబాద్, చార్మినార్, నాంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా చైన్ స్నాచింగ్​లకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

బంగారం దొంగతనం చేశాక కేసు నుంచి తప్పించుకునేందుకు బెంగళూరు పారిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్​లోని రాయచోటికి చేరుకున్నాడు. అక్కడ ఇతగాడు తన వృత్తి దుకాణం తెరిచాడు. చెన్నూర్, రాయచోటి స్టేషన్ పరిధిలోనూ దొంగతనాలు చేశాడని, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Japan Mango Export Ban | పాలకుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం.. అంతర్జాతీయ వేదికపై మసకబారిన ‘భారత మామిడి’ ఖ్యాతి!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...