Dichpalli Police | కువైట్​లో శవాన్ని పూడ్చిన వ్యక్తి అరెస్ట్​.. కామారెడ్డిలో పట్టుకున్న పోలీసులు

కువైట్​లో మృతదేహాన్ని పూడ్చి పెట్టి భారత్​కు వచ్చిన నిందితుడిని డిచ్​పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, డిచ్​పల్లి : ​Dichpalli Police | కువైట్‌ (Kuwait)లో కనిపించకుండా పోయిన డిచ్​పల్లి మండలం కోరట్పల్లి తండాకు చెందిన గుగ్లోత్ కైలాష్(30) ఇటీవల శవమై తేలినట్లు తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మార్చి నెలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

కువైట్‌లోని సాల్మి ఎడారిలో కైలాష్ శవం పూడ్చి పెట్టడం తీవ్ర కలకలం రేపింది. హైవే పనుల నిమిత్తం మార్చి 19వ తేదీన వెళ్లిన యువకుడు కైలాష్ మరణించినట్లు కువైట్ దేశ పోలీసులు ప్రకటించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేపట్టిన కువైట్ పోలీసులు అక్కడే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా… క్రేన్ ప్రమాదంలో కైలాష్ చనిపోయాడని, భయంతో తాను, తన తండ్రి కలిసి శవాన్ని అక్కడే పాతిపెట్టామని తెలిపాడు. నిందితుడిని డిచ్​పల్లి మండలం సాంపల్లి తండా పంచాయతీ పరిధిలోని మేలయ తండాకు చెందిన కార్తీక్​గా కువైట్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

Dichpalli Police | భారత్​కు రావడంతో..

కార్తీక్ తన తండ్రి గణేశ్​తో కలిసి మృతదేహాన్ని పూడ్చివేశాడు. అనంతరం గణేశ్​ భారత్​కు వచ్చాడు. దీంతో కైలాష్ కుటుంబ సభ్యులు డిచ్​పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా అలర్ట్ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి కోరట్​పల్లి తండాకు వెళ్లి మృతుడు కైలాష్ కుటుంబాన్ని పరామర్శించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకోవాలని సీఐ వినోద్, ఎస్సై అరీఫ్​ను ఆదేశించారు.

Dichpalli Police | నిఘా పెట్టి..

కువైట్​లో కైలాష్ శవాన్ని పూడ్చి పెట్టిన ఘటనలో కార్తీక్​ తండ్రి బాదావత్ గణేష్ కదలికలపై నిఘా పెట్టిన డిచ్​పల్లి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డిలో పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్సై అరీఫ్ తన సిబ్బందితో కామారెడ్డి పట్టణంలో తీవ్రంగా గాలించి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గణేశ్​ను డిచ్​పల్లి ఠాణాకు కతీసుకు రాకుండా వేరే పోలీస్ స్టేషన్​లో ఉంచినట్లు సమాచారం. గణేశ్​ను పోలీసులు ఎవరికి అప్పగిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే క్రైమ్ జరిగింది కువైట్ దేశంలో, ఇప్పటికే ఆ దేశంలో ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడు గణేశ్​ను పోలీసులు ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది.

దీనిని కూడా చదవండి : Mudragada Padmanabham | ముద్రగడ పద్మనాభం కన్నుమూత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *