అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New Cars Burnt | కొత్త కార్లను షోరూంకు తీసుకు వెళ్తున్న కంటైనర్‌లో మంటలు అంటుకున్నాయి. అవి వేగంగా వ్యాపించి అందులో ఉన్న 10 కొత్త కార్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన మెదక్ (Medak) జిల్లాలో చోటు చేసుకుంది.
మెదక్ జిల్లాలో తూప్రాన్ సమీపంలో 44వ జాతీయ రహదారి (NH-44)పై కొత్త కార్లతో వెళ్తున్న కంటైనర్‌లో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కంటైనర్‌లో ఉన్న 10 కొత్త కార్లు దగ్ధమయ్యాయి. కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ వాహనం కాకినాడలో డెలివరీ చేయాల్సిన మారుతి కార్లను తరలిస్తోంది. లారీ ఇంజన్‌లో మంటలు చెలరేగి, వేగంగా వ్యాపించడంతో కంటైనర్‌తో పాటు దానిలోని ఎనిమిది కార్లు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే కార్లు కాలిబూడిద అయ్యాయి.
New Cars Burnt | బాపూనగర్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని బాపూనగర్ ప్రాంతంలో ఉన్న రెనోవా హాస్పిటల్ పక్కన గల ఒక స్క్రాప్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సకాలంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఎండలు మండుతుండటంతో ఇటీవల అగ్ని ప్రమాదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Container Lorry Carrying New Cars Catches Fire on NH-44 Near #Tupran, 8 Vehicles Destroyed
A major fire broke out in a container lorry on National Highway-44 at the Nagulapalli Bridge in #Medak district.
The vehicle was transporting eight brand-new Maruti cars from… pic.twitter.com/PfwbLE8uSD
— NewsMeter (@NewsMeter_In) May 21, 2026
దీనిని కూడా చదవండి : White Collar Jobs | ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు


