TNGOs District Secretary | టీఎన్జీవోస్ కార్యాలయ కార్యదర్శిగా కుంట శ్రీనివాస్

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: TNGOs District Secretary | టీఎన్జీవోస్ (Nizamabad TNGOs) కార్యాలయ కార్యదర్శిగా భీమ్‌గల్ (Bheemgal) ఐకేపీ కార్యాలయానికి చెందిన కుంట శ్రీనివాస్‌ నియమితులయ్యారు.

ఇప్పటివరకు భీమ్‌గల్ ఏరియా టీఎన్జీవోస్ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సేవలందించిన ఆయనను, పదోన్నతిపై జిల్లా కార్యవర్గంలోకి తీసుకున్నట్లు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

TNGOs District Secretary | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి..

కుంట శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

తన నియామకానికి సహకరించిన జిల్లా కార్యదర్శి శేఖర్, కేంద్ర సంఘం బాధ్యులు పోల శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్, ఎన్నికల అధికారి వనమాల సుధాకర్, ఐకేపీ జేఏసీ అధ్యక్షుడు మాణిక్యం, సీసీల యూనియన్ అధ్యక్షుడు తడకల శ్రీనివాస్, వివిధ యూనిట్ల అధ్యక్షులతో పాటు డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ సీసీలు, ఐకేపీ వీవోఏలు, గ్రామ సంఘాల సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: AP Investment Projects|ఏపీలో ప్రాజెక్టుల స్పీడప్.. మంత్రుల కమిటీకి చంద్రబాబు కీలక ఆదేశాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *