AP Investment Projects|ఏపీలో ప్రాజెక్టుల స్పీడప్.. మంత్రుల కమిటీకి చంద్రబాబు కీలక ఆదేశాలు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:AP Investment Projects|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, కుదుర్చుకున్న ఒప్పందాలను వేగంగా పట్టాలెక్కించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandrababu Naidu) నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సు (పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్) ఒప్పందాలు, అలాగే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై మంత్రుల కమిటీతో సీఎం  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ నేతృత్వంలోని సబ్ కమిటీకి ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం చేశారు.

AP Investment Projects|ఇప్పటికే 114 ప్రాజెక్టులు గ్రౌండ్..

రాష్ట్రంలో ఎస్‌ఐపీబీ ద్వారా ఇప్పటివరకు రూ.11.47 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయంతో కూడిన 282 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుల తాజా పరిస్థితిని మంత్రుల కమిటీ చైర్మన్ నారా లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఆమోదం పొందిన వాటిలో ఇప్పటికే 114 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించుకున్నాయని (గ్రౌండ్ అయ్యాయని) లోకేశ్ తెలిపారు.

AP Investment Projects|భూ కేటాయింపులు వేగవంతం చేయాలి..

సదస్సులో కుదిరిన ప్రతి ఒప్పందం వాస్తవరూపం దాల్చాలని అధికారులను, మంత్రులను సీఎం ఆదేశించారు. ఇంకా ప్రారంభం కాని మిగిలిన ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పట్టాలెక్కించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు.

AP Investment Projects|సమావేశానికి హాజరైన ప్రముఖులు..

ఈ కీలక సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయిప్రసాద్‌తో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్‌ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ , పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: White Collar Jobs | ఏఐతో వైట్​ కాలర్​ ఉద్యోగాలకు ముప్పు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *