Donald Trump NBC Interview | నువ్వొక థర్డ్ రేట్ రిపోర్టర్.. నీకు ఇంటర్వ్యూ చేయడం కూడా రాదు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై తన అసహనాన్ని ప్రదర్శించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Donald Trump NBC Interview | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) మరోసారి మీడియాపై తన అసహనాన్ని ప్రదర్శించారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘ఎన్‌బీసీ’ (NBC) ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. యాంకర్ అడిగిన ప్రశ్నలకు తీవ్రంగా స్పందిస్తూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Donald Trump NBC Interview | అసలేం జరిగిందంటే..?

ఎన్‌బీసీ యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ అడిగిన ప్రశ్నలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ట్రంప్ పాత వాదనను మళ్లీ తెరపైకి తెచ్చారు. అయితే, ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, కోర్టులు కూడా ఈ పిటిషన్లను కొట్టివేసాయంటూ యాంకర్ క్రిస్టెన్ గుర్తుచేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రంప్ లైవ్‌లోనే యాంకర్‌పై విరుచుకుపడ్డారు. “నువ్వొక థర్డ్ రేట్ రిపోర్టర్.. నీకు ఇంటర్వ్యూ చేయడం కూడా రాదు” అంటూ కెమెరా ముందే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన సూట్‌కు ఉన్న మైక్‌ను తీసేసి, ఇంటర్వ్యూను మధ్యలోనే ముగించి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Donald Trump NBC Interview | అన్‌కట్ వీడియోను విడుదల చేసిన వైట్‌హౌస్..

ఈ వివాదం అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడంతో వైట్‌హౌస్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగింది? యాంకర్ ప్రవర్తన ఎలా ఉందనేది ప్రజలకు స్పష్టంగా చూపించడానికి వైట్‌హౌస్ సిబ్బంది రికార్డ్ చేసిన పూర్తి అన్‌కట్ (Uncut) ఆడియో, వీడియో ఫుటేజీని అధికారికంగా విడుదల చేశారు. ఈ పరిణామం ఇప్పుడు అమెరికా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి:  Air India Aircraft Damage | విమానాలను ఢీకొన్న గ్రౌండ్ సపోర్టు పరికరాలు.. 3 ఫ్లైట్లు ధ్వంసం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *