FIFA World Cup | ఫిఫా వరల్డ్​ కప్​ విజేతకు రూ.420 కోట్ల ప్రైజ్​ మనీ

ఫిఫా వరల్డ్‌ కప్‌ విజేతగా స్పెయిన్‌ నిలిచింది. ఆ జట్టుకు రూ.420 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : FIFA World Cup | ఫిఫా వరల్డ్‌ కప్‌ – 2026 విజేతగా స్పెయిన్‌ నిలిచిన విషయం తెలిసిందే. కప్​ గెలిచిన ఆ దేశానికి రూ.420 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్‌ అర్జెంటీనాకు రూ.277 కోట్ల ప్రైజ్‌మనీ రానుంది.

న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్​లో స్పెయిన్ ఘన విజయం సాధించింది. నిర్ణిత సమయంలో రెండు జట్లు గోల్​ చేయలేకపోయాయి. అదనపు సమయంలో స్పెయిన్​ (Spain) గోల్​ కొట్టి మ్యాచ్​ గెలిచింది. ఆ దేశ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ ఈ ఏడాది ప్రపంచ కప్‌లో తన మొదటి గోల్‌ను సాధించడంతో పాటు దేశానికి కప్​ను అందించాడు. రెడ్​ కార్డుతో ఎంజో ఫెర్నాండెజ్‌ను మైదానం నుండి పంపించివేయడంతో అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లకే పరిమితమైన సమయంలో ఈ గోల్ నమోదైంది. స్పెయిన్​కు ఇది రెండో ప్రపంచ కప్​. 2010లో ఆ దేశంలో తొలిసారి కప్​ గెలిచింది.

FIFA World Cup | ప్రైజ్ మనీ వివరాలు..

ఫిపా ప్రపంచ కప్​ కోసం ఫీఫా కౌన్సిల్ 727 మిలియన్ డాలర్ల ఆర్థిక కేటాయింపును ఆమోదించింది. ఇందులో పాల్గొంటున్న 48 జట్లకు 655 మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీగా కేటాయించారు. రన్నరప్ అర్జెంటీనా – 33 మిలియన్ డాలర్లు, 3వ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్​కు 29 మిలియన్ డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్​కు 27 మిలియన్ డాలర్ల ప్రైజ్​మనీ రానుంది. ఈ మెగా టోర్నీలో ప్రతిభ కనబర్చిన స్పెయిన్​ ఆటగాడు రోడ్రీ గోల్డెన్​ బాల్ దక్కించుకున్నాడు. అర్జెంటినా దిగ్గజం మెస్సీ సిల్వర్​ బాల్, ఫ్రాన్స్​ ఆటగాడు కైలియన్ ఎంబాపే బ్రాంజ్ బాల్ గెలుచుకున్నారు. ఫ్రాన్స్​కు చెందిన కైలియన్ ఎంబాపే గోల్డెన్ బూట్ , లియోనెల్​ మెస్సీ సిల్వర్ బూట్ దక్కించుకున్నారు.

ఇది కూడా చదవండి..: US Iran Conflict | అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *