Houthi Drone Attack | మక్కాపై డ్రోన్​ దాడికి యత్నం.. అడ్డుకున్న సౌదీ

పవిత్ర నగరమైన మక్కాపై హౌతీలు డ్రోన్​ దాడికి యత్నించారని సౌదీ ఆరోపించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Houthi Drone Attack | సౌదీ అరేబియా (Saudi Arabia)లోని పవిత్ర నగరమైన మక్కాపై డ్రోన్​ దాడికి హౌతీలు యత్నించారు. ఈ డ్రోన్​ను సౌదీ విజయవంతంగా అడ్డుకుంది. హౌతీల దాడుల నేపథ్యంలో దేశంలో అలర్ట్ ప్రకటించింది.

యెమెన్‌కు చెందిన హౌతీలు మక్కాను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సౌదీ మక్కాతో పాటు జెడ్డా, తైఫ్ గవర్నరేట్‌లతో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మక్కాలో వైమానిక ముప్పు హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. హౌతీలు ప్రయోగించిన డ్రోన్​ను మక్కాకు దక్షిణాన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.

Houthi Drone Attack | వరుస దాడులు

యెమెన్​లోని హౌతీలకు ఇరాన్​ మద్దతు ఉంది. మరోవైపు ఆ దేశ ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో హౌతీలు కొంతకాలంగా సౌదీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ దేశ నౌకలపై దాడులు చేస్తున్నారు. యెమెన్ నుంచి మంగళవారం క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి హౌతీలు జరిపిన దాడిలో మంగళవారం సౌదీలో 13 మంది గాయపడ్డారు. హౌతీల దాడులతో సౌదీలోని మదీనాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన రాకపోకలను కూడా నిలిపివేశారు. కాగా సౌదీపై దాడులను 57 ముస్లిం దేశాల కూటమి ఖండించింది.

Houthi Drone Attack | ఖండించిన హౌతీలు

మక్కాపై దాడి చేయలేదని హౌతీలు తెలిపారు. తమ డ్రోన్​ను కూల్చివేశామని సౌదీ చెప్పడాన్ని వారు ఖండించారు. ఇది అబద్ధం అన్నారు. మక్కాను లక్ష్యంగా చేసుకున్నారన్న వాదనలు పాతబడిపోయిన అబద్ధం, ఇదివరకే ఇలాంటివి వాడారు, ఇకపై ఎవరినీ మోసగించలేరు అని ఎక్స్​లో పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి..: Russia Tariff Bill | ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం.. రష్యా ఆంక్షల బిల్లులో భారత్ పేరు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *