Old City Fire Accident | పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఫైరింజన్​లతో మంటలను ఆర్పి వేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Old City Fire Accident | హైదరాబాద్  (Hyderabad) పాతబస్తీ వాటర్ ట్యాంక్ రోడ్డులోని రెండంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులోని కిడ్స్ స్కూల్ ఉంది.

ఓల్డ్​ సిటీలోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్​లో గల ఓ రెండు అంతస్తుల భవనంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో కిడ్స్​ స్కూల్​ నిర్వహిస్తున్నారు. స్కూల్​లో మంటలు చెలరేగి భవనం మొత్తం వ్యాపించాయి. స్థానికులు గమనించి రెండో అంతస్తులో నివాసం ఉంటున్న కుటుంబాలను బయటకు తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Old City Fire Accident | సహాయక చర్యలు

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్​ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ బాధితులను పరామర్శించారు.

ఇది కూడా చదవండి..: Tank Bund Ganesh Immersion | ట్యాంక్ బండ్ పై గణేశ నిమజ్జనం నిషేధం.. అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *