Chandrababu Naidu Tirumala | శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

శ్రీవారి కృప, ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Naidu Tirumala | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ Andhra pradeshప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

అనంతరం టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ 2027 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

Chandrababu Naidu Tirumala | ఏర్పాట్లను పర్యవేక్షించిన భానుప్రకాశ్​ రెడ్డి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీవారిని ప్రార్థిస్తూ, రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్​ రెడ్డి పర్యవేక్షించారు. సీఎం వెంట ఉంటూ దర్శనం చేయించారు. శ్రీవారి కృప, ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *