Hyderabad Fire Accident | హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్​ నగరంలోని దత్తాత్రేయ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Fire Accident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని దత్తాత్రేయ నగర్‌లో ఉన్న సయ్యద్ అలీకి చెందిన ఫర్నిచర్ గోదాములో మంటలు చెలరేగాయి.

Hyderabad Fire Accident | కాలిపోయిన గోదాములు

అపార్ట్‌మెంట్లు, నివాస గృహాల మధ్య ఉన్న ఈ గోదాములు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తప్పాచబుత్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Abdullapurmet ACB Raid | రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌, సర్వేయర్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *