అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | ఐటీ, బ్యాంకింగ్ రంగాలు రాణిస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం కోలుకుంది. హెచ్‌సీఎల్ టెక్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండడంతో ఐటీ షేర్లు పరుగులు తీస్తున్నాయి. ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఒత్తిడిని తగ్గించడంతో రూపాయి విలువ వరుసగా రెండో సెషన్లోనూ బలపడింది. ఫారెక్స్ డెరివేటివ్‌లలో ట్రేడింగ్‌ను పరిమితం చేయడం, ట్రేడింగ్ వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్బీఐ విధించిన ఆంక్షలు రూపాయికి ఉపశమనం కలిగించాయి.
Indian Stock Market | ఫ్లాట్ గా ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 37 పాయింట్ల స్వల్ప గ్యాప్ అప్‌లో ప్రారంభమైనా తొలుత అమ్మకాల ఒత్తిడితో 248 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 917 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ ఫ్లాట్‌గా ప్రారంభమై 75 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కష్టాలనుంచి కోలుకుని 293 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 434 పాయింట్ల లాభంతో 72,358 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో 22,502 వద్ద ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు రాణిస్తున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 22 స్టాక్స్ లాభాలతో, 8 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 5.76 శాతం, టీసీఎస్ 4.89 శాతం, టెక్ మహీంద్రా 3.33 శాతం, ఇన్ఫోసిస్ 2.06 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 1.72 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : మారుతి 1.26 శాతం, ఎన్టీపీసీ 0.69 శాతం, ఇండిగో 0.66 శాతం, పవర్‌గ్రిడ్ 0.40 శాతం, ఎయిర్టెల్ 0.28 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Oct 13 Gold Prices | బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు!