అక్షరటుడే, వెబ్డెస్క్ : Kachiguda Railway Station | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్లో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి తన కూతురితో కలిసి రైలు ఎక్కుతుండగా పట్టు తప్పి కింద పడిపోయాడు.
ఓ వ్యక్తి తన కుమార్తెతో కలిసి రైల్వే స్టేషన్కు వచ్చాడు. అతడు విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి ఉంది. అయితే రైలు కదలడం ప్రారంభించడంతో అతను తన కూతురిని ఎత్తుకొని పరిగెత్తుతూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారడంతో కింద పడిపోయాడు.
Kachiguda Railway Station | స్పందించిన కానిస్టేబుల్
ఈ ఘటన సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి కిందపడటం గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనా కుమారి వెంటనే స్పందించారు. వారిని సురక్షితంగా బయటకు లాగారు. అదే సమయంలో, లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును నిలిపివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత, ఆ కుటుంబం సురక్షితంగా రైలు ఎక్కింది.
ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం