CBFC Advisory Committee | సెన్సార్ బోర్డు సలహా మండలి సభ్యుడిగా రమేష్ ముస్త్యాల

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, హైదరాబాద్ ప్రాంతీయ సలహా మండలి సభ్యుడిగా రమేష్ ముస్త్యాల నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, హైదరాబాద్​​ : CBFC Advisory Committee | భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), హైదరాబాద్ (Hyderabad) ప్రాంతీయ సలహా మండలి సభ్యుడిగా రమేష్ ముస్త్యాల నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయనకు ఉత్తర్వులు అందజేశారు.

CBFC Advisory Committee | 4న జారీ చేసిన నోటఫికేషన్​ ప్రకారం..

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2026 నవంబర్ 4న జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం రమేష్​ మస్త్యాలను ఈ పదవిలో నియమించారు. ఈ నియామకం మూడేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమల్లో ఉంటుంది. ఈ మేరకు సీబీఎఫ్​సీ (CBFC) హైదరాబాద్ ప్రాంతీయ అధికారి డాక్టర్ రాహుల్ గోవిల్కర్ నవంబర్ 9న రమేష్ ముస్త్యాలకు అధికారిక నియామక సమాచార లేఖను అందజేశారు.

CBFC Advisory Committee | గతంలో పలు పదవుల్లో రమేష్​ మస్త్యాల..

గతంలో దక్షిణ మధ్య రైల్వే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సభ్యుడిగా, అఖిల భారత టెక్స్‌టైల్స్ బోర్డు సభ్యుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి సభ్యుడిగా రమేష్ ముస్త్యాల సేవలందించారు. ఈ సందర్భంగా రమేష్ ముస్త్యాల మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Fake Certificates Scam | నకిలీల గుట్టు రట్టయ్యేనా..? కామారెడ్డిలో భారీగా నకిలీ సర్టిఫికెట్ల విక్రయం..?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *