Nacharam Hostel Fire | లేడీస్​ హాస్టల్​లో అగ్ని ప్రమాదం

నాచారంలోని ఓ లేడీస్​ హాస్టల్​లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nacharam Hostel Fire | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని నాచారంలో గల ఓ లేడీస్​ హాస్టల్​లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సావర్కర్ నగర్‌లో ఉన్న శ్రీ లక్ష్మి మహిళా హాస్టల్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

హాస్టల్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్​లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ఆస్తి నష్టం ఎంత వాటిల్లిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Illegal Water Business | అక్రమ నీటి దందాపై చర్యలు.. ఏడు బోర్లు పూడ్చివేత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *