అక్షరటుడే, వెబ్డెస్క్ : Murasu Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుపాన్ తీరాన్ని దాటింది. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల నుండి 5:30 గంటల మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని తాకింది. దీంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాన్ ప్రభావంతో ఒంగోలు, చీరాల, బాపట్ల తీర ప్రాంతాల్లో గంటకు 120–155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. బాపట్ల, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ (విజయవాడ) జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొండేపి టంగుటూరు రోడ్డుపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షాల నేపథ్యంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్లో కొల్లామ్ వైజాగ్ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు.
Murasu Cyclone | తెలంగాణలో..
తుపాన్ ప్రభావంతో తెలంగాణ (Telangana)లోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో నేడు సాయంత్రం నుండి బుధవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, యాదాద్రి-భువనగిరి, నాగర్కర్నూల్, జనగామ, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి..: మంత్రి దామోదరపై ఆరోపణలు… ఖండించిన చిట్టిబాబు