అక్షరటుడే, వెబ్డెస్క్ : HYDRAA Land Protection | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రా కఠిన చర్యలు చేపడుతోంది. చెరువుల్లో ఆక్రమణలను తొలగించి, వాటికి పూర్వ వైభవం తెస్తోంది. అంతేగాకుండా ప్రభుత్వ, ప్రజావసరాలకు కేటాయించిన భూములను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. తాజాగా మాదాపూర్లో రూ.400 కోట్ల విలువైన భూమిని కాపాడింది.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ (Madhapur)లోని ఖనమేట్ గ్రామంలో గురువారం హైడ్రా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. గ్రామంలోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారు. దాని విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. ఆ భూమి చుట్టూ వేసిన బ్లూ షీట్స్ను తొలగించారు. ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
HYDRAA Land Protection | కూకట్పల్లి నాలా విస్తరణకు చర్యలు
ఫతేనగర్ – బాలానగర్ పారిశ్రామిక, నివాస ప్రాంతాల్లో వరద ముప్పును పరిష్కరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. కూకట్పల్లి నాలాలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆక్రమణల తొలగింపుపై హైడ్రా దృష్టి సారించింది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం సమీక్ష నిర్వహించారు. చెరువుల నుంచి వచ్చే వరద నీరు ఆటంకాలు లేకుండా నాలాల ద్వారా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
దీనిని కూడా చదవండి : TG SAFE Raids | డెయిరీ యూనిట్లపై దాడులు.. 3.6 టన్నుల కోవా స్వాధీనం