అక్షరటుడే, వెబ్డెస్క్: TG SAFE Raids | హైదరాబాద్ (Hyderabad) నగరం (CURE)లోని పలు డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే తనిఖీలు చేపట్టారు.
నగరంలోని 6 పాల ఉత్పత్తుల తయారీ యూనిట్లు, ఒక రవాణా కేంద్రాన్ని తనిఖీ చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. లైసెన్స్ లేకుండా యూనిట్లను నడపడం, ఉత్పత్తులను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు.
TG SAFE Raids | బస్సుల్లో కోవా రవాణా
పాలకోవాను రిఫ్రిజిరేటర్ ఉన్న వాహనాల్లో తరలించాల్సి ఉంటుంది. అయితే కోవాను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి, కోల్డ్-స్టోరేజ్ సౌకర్యాలున్న రిఫ్రిజిరేటెడ్ వాహనాలకు బదులుగా బస్సులు, డీసీఎం వాహనాల్లో హైదరాబాద్కు రవాణా చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న 3.6 టన్నుల కోవాను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని యూనిట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Ghatkesar CI Suspension | ఘట్కేసర్ సీఐపై సస్పెన్షన్ వేటు