Hyderabad Police Firing | హైదరాబాద్​లో కాల్పుల కలకలం.. దొంగను పట్టుకునేందుకు ఫైరింగ్​ చేసిన పోలీసులు

హైదరాబాద్​ నగరంలో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్​ వాంటెండ్​ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police Firing | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్​ వాంటెండ్​ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

నల్గొండ జిల్లాలో చోరీలకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్​లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నల్గొండ సీసీఎస్ (Nalgonda CCS)​ పోలీసులు అతడిని పట్టుకునేందుకు హైదరాబాద్​ వెళ్లారు. ఈ క్రమంలో ఆదిభట్ల వద్ద ఔటర్​ రింగ్ రోడ్డు సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించారు.

Hyderabad Police Firing | కత్తితో దాడి

పోలీసులను చూసిన నిందితుడు భూష్మి శ్రీకాంత్​ వారిపై కత్తితో దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతడి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటన రాత్రి 11:30 గంటలకు చోటు చేసుకుంది. అనంతరం స్వల్ప గాయాలు అయిన శ్రీకాంత్​ను వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 10కి పైగా దొంగతనాల కేసుల్లో నిందితుడిగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ ఈ ఘటనలో రెండు కాళ్ళకూ బుల్లెట్ గాయాలపాలయ్యాడు. ఈ ఘటనలో నల్గొండ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి తలకు గాయం అయినట్లు సమాచారం.

దీనిని కూడా చదవండి : Heavy Rain Alert | నేడు పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *