Home Guard Arrested | మహిళపై దాడి చేసిన హోమ్​గార్డు అరెస్ట్

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనలో హోమ్ గార్డ్ ఆనంద్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Home Guard Arrested | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనలో హోమ్ గార్డ్ ఆనంద్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి మియాపూర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళను కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని హోమ్​గార్డు ఆనంద్​ లాక్కెళ్లాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. అతడు రైల్వే పోలీసు అని మొదట ప్రచారం జరిగింది. అయితే మహిళపై దాడి చేసింది రైల్వే పోలీస్ కాదు.. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హోంగార్డ్ అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Home Guard Arrested | డిప్యుటేషన్​పై..

హోమ్​గార్డు ఆనంద్​ డిప్యుటేషన్​పై రైల్వే స్టేషన్ వద్ద డ్యూటీ చేస్తున్నాడని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. అతనిని సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు, క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించానని చెప్పారు. ఈ క్రమంలో మియాపూర్​ పోలీసులు హోమ్​గార్డు ఆనంద్​ను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..: Miyapur Drug Peddler Arrest | హైదరాబాద్‌లో కలకలం రేపిన డ్రగ్స్ రాకెట్.. మియాపూర్‌లో 14 ఎక్టసీ మాత్రలతో పెడ్లర్ సురేష్ గోపీ అరెస్టు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *