DCP Pub Raid | సినిమా స్టైల్‌లో డీసీపీ స్పై ఆపరేషన్.. గలీజ్ దందా చేస్తున్న 10 మంది అరెస్ట్

సినిమా స్టైల్‌ను తలపించేలా ఒక మహిళా పోలీస్ అధికారి అర్ధరాత్రి వేళ ఒంటరిగా పబ్‌లోకి దూరి భారీ స్పై ఆపరేషన్ నిర్వహించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: DCP Pub Raid | సినిమా స్టైల్‌ను తలపించేలా ఒక మహిళా పోలీస్ అధికారి అర్ధరాత్రి వేళ ఒంటరిగా పబ్‌లోకి దూరి భారీ స్పై ఆపరేషన్ నిర్వహించారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని (సెక్యూరిటీ) కూడా పక్కన పెట్టేసి, కస్టమర్ లాగా పబ్‌లోకి వెళ్లిన ఆమె.. అక్కడ సాగుతున్న అసాంఘిక కార్యక్రమాల గుట్టురట్టు చేశారు. ఈ సాహసోపేతమైన దాడులు చేసిన లేడీ ఆఫీసర్ మరెవరో కాదు.. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ) రితిరాజ్.

DCP Pub Raid | ఒంటరిగానే పబ్‌లోకి ఎంట్రీ..

నగరంలోని ‘కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్’ (Kings and Queen Pub) లో చట్టవిరుద్ధమైన పనులు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో డీసీపీ రితిరాజ్ రంగంలోకి దిగారు. అయితే ముందే తెలిస్తే నిర్వాహకులు అలర్ట్ అవుతారని భావించిన ఆమె, రాత్రి సమయంలో తన భద్రతా సిబ్బందిని దూరంగా ఉంచేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఒంటరిగా పబ్‌లోకి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు చేస్తున్న ‘గలీజ్ దందా’ను, అసాంఘిక వ్యవహారాలను తన వద్ద ఉన్న కెమెరాతో స్వయంగా షూట్ చేసి పక్కా ఆధారాలు సేకరించారు.
dcp.1

 

DCP Pub Raid | స్థానిక పోలీసులపై ఆగ్రహం..

పబ్‌లో జరుగుతున్న అక్రమాలను ప్రత్యక్షంగా చూసి రికార్డు చేసిన అనంతరం, డీసీపీ రితిరాజ్ వెంటనే స్థానిక పోలీసులను అక్కడికి పిలిపించారు. తన పరిధిలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై స్థానిక పోలీసులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేడీ డీసీపీ ఆదేశాలతో పబ్‌లో ముమ్మర సోదాలు నిర్వహించిన పోలీసులు.. అసాంఘిక పనులకు పాల్పడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పబ్‌లో అక్రమ దందాలు నడిపిస్తున్న మేనేజర్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. డీసీపీ రితిరాజ్ చేసిన ఈ డేరింగ్ ఆపరేషన్ ఇప్పుడు పోలీస్ శాఖతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి:  Kethireddy Suresh Reddy | మాజీ ఎంపీ సురేష్​రెడ్డి ఇంట్లో భారీ చోరీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *