అక్షరటుడే వెబ్‌డెస్క్: ICICI Life Insurance | 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి (Q2 FY2027) సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. వ్యాపార విస్తరణతో పాటు కస్టమర్ కేంద్రీకృత విధానాలతో కంపెనీ అన్ని విభాగాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2027 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (H1 FY2027) పన్నుల అనంతరం లాభం (PAT) వార్షిక ప్రాతిపదికన 26.5 శాతం పెరిగి రూ. 760 కోట్లకు చేరింది.
ICICI Life Insurance |వృద్ధి రేటు..
కంపెనీ కొత్త వ్యాపారాల ద్వారా పొందే న్యూ బిజినెస్ ప్రీమియం వార్షికంగా 25.0 శాతం వృద్ధితో రూ. 11,821 కోట్లకు చేరుకుంది. అలాగే న్యూ బిజినెస్ విలువ (VNB) 22.3 శాతం పెరిగి రూ. 1,283 కోట్లను తాకింది. కంపెనీ మార్జిన్ 26.0 శాతంగా నమోదైంది. మరోవైపు రిటైల్ సమ్ అష్యూర్డ్ వార్షిక ప్రాతిపదికన 34.9 శాతం వృద్ధితో రూ. 2.32 లక్షల కోట్లకు పెరగ్గా, ఇందులో రిటైల్ ప్రొటెక్షన్ సెగ్మెంట్ 47.2 శాతం , యాన్యుటీ సెగ్మెంట్ 50.0 శాతం అత్యంత బలమైన వృద్ధిని సాధించాయి.
ICICI Life Insurance | పరిశ్రమలోనే అత్యుత్తమ రికార్డు..
2027 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 99.3 శాతంగా నమోదైంది. ఎలాంటి విచారణ అవసరం లేని (Non-investigated) క్లెయిమ్‌లను సగటున కేవలం 1.1 రోజుల్లోనే పరిష్కరించడం విశేషం. ఈ సమీక్షా కాలంలో కంపెనీ రూ. 2,627 కోట్ల డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించగా, రూ. 8,634 కోట్లను మెచ్యూరిటీ , సర్వైవల్ బెనిఫిట్స్ కింద కస్టమర్లకు చెల్లించింది. అంతేకాకుండా, తమ సేవింగ్స్ పాలసీల్లో 54 శాతం పాలసీలను దరఖాస్తు చేసిన రోజే జారీ చేసింది.
ICICI Life Insurance | భవిష్యత్ వ్యూహాలు..
కంపెనీ తన 25 ఏళ్ల ప్రస్థానంలో భాగస్వాములైన 20 కోట్లకు పైగా భారతీయుల ( India ) ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ, సంస్థ పేరును ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (ICICI Life Insurance Limited) గా మార్చుకుంది. ఈ సందర్భంగా ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సిద్ధార్థ మిశ్రా మాట్లాడుతూ.. ‘హర్ కల్ ఆసాన్’ నినాదంతో కస్టమర్ కేంద్రీకృత విధానాలకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. భారత మార్కెట్లో ప్రొటెక్షన్, యాన్యుటీ ఉత్పత్తులకు మంచి అవకాశాలు ఉన్నాయని, వ్యాపారం , లాభదాయకత మధ్య సమతౌల్యత పాటిస్తూ వృద్ధి సాధిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Alumni Reunion | ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుక