Stock Market Rally | మార్కెట్‌పై బుల్స్ పైచేయి.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Rally | యుద్ధాన్ని ముగించే విషయలో అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి దగ్గరవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర బ్యారెల్ కు వంద డాలర్లకు పడిపోవడం, గ్లోబల్ మార్కెట్లు రాణిస్తుండడం, రూపాయి విలువ బలపడడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సైతం భారీగా పెరిగింది. బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ సర్వీసెస్ , ఆటో, ఫార్మా, టెలికాం రంగాల షేర్లు విశేషంగా రాణించాయి.

Stock Market Rally | గ్యాప్ అప్ లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం గ్యాప్ అప్ లో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 407 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 251 పాయింట్లు పెరిగింది. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా అక్కడినుంచి 902 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 79 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 253 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత మార్కెట్ ను బుల్స్ తమ చేతుల్లోకి తీసుకున్నాయి. దీంతో సూచీలు భారీగా పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 940 పాయింట్ల నష్టంతో 77,958 వద్ద, నిఫ్టీ 298 పాయింట్ల నష్టంతో 24,330 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | రాణించిన ఆటో, బ్యాంకింగ్ రంగాలు..

నిఫ్టీ (Nifty)లో టెలికాం ఇండెక్స్ 2.94 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.63 శాతం, రియాలిటీ 0.63 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.47 శాతం, ఆటో 2.41 శాతం, ఫార్మా 2.30 శాతం పెరగ్గా.. పవర్ 0.47 శాతం, ఎఫ్ ఎంసీఈ 0.26 శాతం, యుటిలిటీ 0.19 శాతం శాతం నష్టపోయాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,862 కంపెనీలు లాభపడగా 1,365 స్టాక్స్ నష్టపోయాయి. 167 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 168 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 25 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6 లక్షల కోట్లమేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో, 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 6.60 శాతం, ట్రెంట్ 3.91 శాతం, ఆసియన్ పెయింట్ 3.56 శాతం, ఎస్ బీఐ 3.38 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 3.11 శాతం లాభపడ్డాయి.

Top Losers : రిలయన్స్ 1.80 శాతం, ఎల్ టీ 1.18 శాతం, పవర్ గ్రిడ్ 1.11 శాతం, ఎన్టీపీసీ 1 శాతం, హెచ్ సీఎల్ టెక్ 0.97 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Updates | ఒడిదుడుకుల్లో మార్కెట్లు..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *