Stock Market | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | పశ్చిమాసియాలో జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడంతో తిరిగి క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలొచ్చాయి. బ్యారెల్ ధర 105 డాలర్లపైనే ట్రేడ్ అవుతోంది. ఐటీ సెక్టార్‌లో సెల్లాఫ్ ఆగడం లేదు. దీనికితోడు రూపాయి బలహీనత, ఎఫ్ ఐఐల పెట్టుబడుల ఉపసంహరణతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. గ్లోబల్ క్యూస్ కూడా నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Stock Market | భారీ నష్టాల దిశగా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం భారీ నష్టాల దిశగా సాగుతోంది. ఉదయం సెన్సెక్స్ 181 నష్టంతో ప్రారంభమైనా వెంటనే కోలుకుని 227 పాయింట్లు పెరిగింది. అయితే గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో 976 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 106 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 297 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 916 పాయింట్ల నష్టంతో 76,747 వద్ద, నిఫ్టీ 260 పాయింట్ల నష్టంతో 23,912 వద్ద ఉన్నాయి.

Stock Market | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..

దేశీయ స్టాక్ మార్కెట్ లో అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 4.07 శాతం, యుటిలిటీ 1.59 శాతం, టెలికాం 1.55 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.53 శాతం, మీడియా 1.50 శాతం, పవర్, రియాలిటీ ఇండెక్స్‌లు 1.40 శాతం, టెలికాం 1.38 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.36 శాతం, ఫార్మా 1.28 శాతం నష్టంతో ఉన్నాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ లాభాలతో, 26 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎం అండ్ ఎం 0.16 శాతం, ఎస్‌బీఐ 0.13 శాతం, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ 0.13 శాతం, కొటక్ బ్యాంక్ 0.04 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 5.23 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4.35 శాతం, టీసీఎస్ 3.44 శాతం, టెక్ మహీంద్రా 3.37 శాతం, సన్‌ఫార్మా 2.99 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: April 24 Market Analysis | మిక్స్ డ్ గా గ్లోబల్ మార్కెట్లు.. నష్టాలతో ప్రారంభంకానున్న దేశీయ మార్కెట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *