వరంగల్RTC Workers Protest | పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికులు

RTC Workers Protest | పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్లు మొక్కారు. నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Workers Protest | ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్లు మొక్కారు. నర్సంపేట డిపో (Narsampeta Depot)కు శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. అయితే ఇందుకు పోలీసులు ఒప్పుకోవడం లేదు.

వరంగల్​ జిల్లా (Warangal District) నర్సంపేట డిపోలో డ్రైవర్​గా పని చేస్తున్న శంకర్​గౌడ్​ పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని ఆయన స్వగ్రామం ముత్తోజిపేటకు తీసుకు వెళ్లారు. శంకర్​ గౌడ్​ మృతదేహాన్ని డిపో వద్దకు తీసుకు వెళ్లడానికి అనుమతించాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించడానికి భారీగా ఆర్టీసీ కార్మికులు (ఆర్టీసీ కార్మికులు) చేరుకుంటున్నారు.

RTC Workers Protest | మాజీ మంత్రి నివాళులు

శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ (Former Minister Satyavathi Rathod) నివాళులు అర్పించారు. కార్మికుల డిమాండ్ మేరకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తీసుకెళ్లలా అనుమతి ఇవ్వాలని పోలీసులతో మాట్లాడారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వాహనం ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకులు శంకర్ గౌడ్ నివాసానికి చేరుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..: RTC Driver | మరో ఆర్టీసీ డ్రైవర్​ ఆత్మహత్యాయత్నం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...