నిజామాబాద్RTC Strike in Kamareddy | కామారెడ్డిలో ఉద్రిక్తత.. డిపో నుంచి బస్సులు రాకుండా కార్మికుల...

RTC Strike in Kamareddy | కామారెడ్డిలో ఉద్రిక్తత.. డిపో నుంచి బస్సులు రాకుండా కార్మికుల అడ్డగింత..

కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు బస్సులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

అక్షరటుడే, కామారెడ్డి: RTC Strike in Kamareddy | రాష్ట్రవాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఉదయం డిపో నుంచి నిజాంసాగర్ (Nizamsagar) వెళ్లడానికి అద్దె బస్సును బయటకు తీయగా జేఏసీ నాయకులు అడ్డుకుని బస్సులో గాలి తీసేశారు. కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మద్దతుగా సమ్మెలో కూర్చున్నారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేయగా కార్మికులు అడ్డుకున్నారు.

RTC Strike in Kamareddy | సమ్మెకు మద్దతిస్తే అరెస్టులా..?

సమ్మెకు మద్దతిస్తే ఎలా అరెస్ట్ చేస్తారని నాయకులు ప్రశ్నించారు. దాంతో పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ డ్రైవర్​ను పోలీసులు బురదలోకి తోసేశారని కార్మిక నాయకులు ఆరోపించారు. ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి ఫోన్ లాక్కున్నారని పేర్కొన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన వారిని అరెస్టు చేసినందుకు పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు (RTC Workers) మాట్లాడుతూ.. తమకు మద్దతుగా సమ్మెలో కూర్చున్న వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు. ఇది సమ్మెను నిర్వీర్యం చేయడమేనన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

RTC Strike in Kamareddy

RTC Strike in Kamareddy | దారి వదలండి..: ఆర్డీవో

ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు ఆర్డీవో ఎన్​వై గిరి చేరుకుని మాట్లాడారు. బస్సులు నడవకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, సాధారణ ప్రజలు, పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, దారికి అడ్డు తప్పుకోవాలని సూచించారు. సమ్మెను యథావిధిగా కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్డీవో తెలపగా కార్మికులు ఒప్పుకోలేదు. బస్సులకు దారి ఇచ్చిన తర్వాత తాము సమ్మె చేయడంలో అర్థం లేదన్నారు. దారి ఇవ్వాలని ఉద్దేశ్యం ఉంటే డ్యూటీలోనే ఉండేవాళ్లమని, తమ బాధను ప్రభుత్వానికి నివేదించాలని కార్మికులు కోరారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Premier League | ఉత్సాహంగా నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​ టోర్నీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....