Nizamabad Premier League | ఉత్సాహంగా నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​ టోర్నీ

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Premier League | నిజామాబాద్​ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ(cricket tournament) ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతోంది. స్థానిక ఉమెన్స్​ కాలేజ్​ గ్రౌండ్​లో (Womens College Ground) రెండోరోజు మంగళవారం లీగ్​ పోటీలు నిర్వహించారు.

Nizamabad Premier League | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో..

ఈ సందర్భంగా గ్రౌండ్​లో నాలుగు మ్యాచ్​లు జరిగాయి. పోటీల సందర్భంగా సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) మాట్లాడుతూ.. యువత పెడదారిన పడకుండా ఉండేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అలాగే యువత తప్పనిసరిగా ట్రాఫిక్​ నియమాలు పాటించాలని సూచించారు. రెండోరోజు గజానన్​ టీం, గుండారం టీం తలపడగా.. గజానన్​ టీం విజయం సాధించింది. వేల్పూర్​, ముప్కాల్ జట్లు పోరాడగా.. వేల్పూర్​ పీఎస్​ జట్టు గెలిచింది.

అలాగే ఛత్రపతి శివాజీ, అమ్దాపూర్​ జట్లు తలపడగా.. ఛత్రపతి శివాజీ జట్టు విజయకేతనం ఎగురవేసింది. మోహన్​ ఎలెవన్​, వర్ని వారియర్స్​ జట్ల మధ్య పోటీ జరగగా.. వర్ని వారియర్స్​ వాకోవర్​ చేయగా.. మోహన్​ ఎలెవన్​ జట్టు విజేతగా ప్రకటించారు.

కార్యక్రమంలో నిజామాబాద్​ సెక్యూరిటీ ​ కౌన్సిల్ (Nizamabad Security Council)​ ఛైర్మన్​ సీపీ సాయిచైతన్య, జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ కాకతీయ విద్యాసంస్థల (Kakatiya Educational Institutions) అధినేత రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

76886

ఇది కూడా చదవండి: Baswareddy Farewell | అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *